Thursday 25 October 2012

Village Revenue Office 2012

ఉద్యోగ సోపానం
1. ద్రవీకృత పెట్రోలియం వాయువు(LPG) లో అధికంగా ఏ వాయువు ఉంటుంది?
    1. మీధేన్
    2. ఏసిటిలీన్
    3. బ్యూటేన్
    4. ఆక్టేన్     [3]

2. విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో ఆనోడ్ దగ్గర జరిగేది ఏమిటి?
    1. పరిక్షేపణం
    2. ఆక్సీకరణం
    3. క్షయకరణం
    4. పరిక్షేపణం, ఆక్సీకరణం     [2]

3. నేలలో నైట్రోజన్ లోపం వల్ల కలిగే నష్టం?
    1. మొక్కలు పుష్పించడం, పళ్లు పండడం నిరోధించబడుతుంది.
    2. మొక్కల పెరుగుదలను నిరోధించి, ఆకులు పసుపు పచ్చగా మారును.
    3. ఆకులు మందంగా తయారౌతాయి.
    4. విత్తనాలు మొలకెత్తకుండా చేయును.     [2]

4. సముద్ర అంతర్భాగంలో ప్రయాణించేవారు శ్వాస తీసుకోవడం కోసం కింది వయువుల మిశ్రమాన్ని వాడతారు?
    1. ఆక్సిజన్, కార్భన్డయాక్సైడ్ ల మిశ్రమం
    2. హైడ్రోజన్, ఆక్సిజన్ ల మిశ్రమం
    3. ఆక్సిజన్, నైట్రోజన్ ల మిశ్రమం
    4. ఆక్సిజన్, హీలియం ల మిశ్రమం    [4]

5. ఈ కింది వానిలో కర్పూరాన్ని సులభంగ శుద్ది చేసే ప్రక్రియ ఏది?
    1. ఉత్పతనం
    2. స్వేదనం
    3. స్పటికీకరణం
    4. వడపోత     [1]

6.శూన్యంలో కాంతి వేగం?
    1. 330 మీ/సెకను
    2. 330 సెం.మీ/సెకను
    3. 3 X 1010 మీ/సెకను
    4. 3 X 108 మీ/సెకను     [4]

7. మానవుడు మొట్ట మొదటి సారిగా చంద్రుడు మీద కాలు మోపిన సంవత్సరం ఏది?
    1. 1981
    2. 1965
    3. 1969
    4. 1971     [3]

8. టేప్ రికార్డర్ ద్యారా ధ్యనిని ఏ రూపంలో రికర్డ్ చేస్తారు?
    1. ఎలక్టిక్ శక్తి
    2. ఆయస్కాంత క్షేత్రం
    3. చర నిరోదకం
    4. టేపుల మీద ద్వని తరంగాలు     [2]

9. మానవుని సామాన్య శరీర ఉష్ణోగ్రత సెంటీగ్రేడ్ మరియు ఫారెన్ హీట్ కొలమానాలలో వరుసగా?
    1. 99.4; 37.9
    2. 98.4; 36.9
    3. 36.9; 98.4
    4. 37.9; 99.4     [3]

10. ఒకే పరమాణు సంఖ్య వేర్యేరు ద్రవ్యరాశి సంఖ్య గల ఒకే మూలక పరమాణులను ఏమంటారు?
    1. ఐసోబారులు
    2. ఐసోటోనులు
    3. ఐసోమరులు
    4. ఐసోటోపులు     [4]

11. బిడు భూములను సస్యశ్యామలం చెసెందుకు ఆంధ్రప్రదెశ్ ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రవేశపెట్టింది?
    1. ఇందిరా క్రాంతి ప్రథకం
    2. ఇందిరా ప్రభ ప్రథమ్కం
    3. ఇందిరమ్మ పథకం
    4. రాజీవ్ పథకం     [2]

12. ఆంద్రప్రదేశ్ ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు?
    1. గౌ|| శ్రీ దామోదర్ రాజనరసింహ
    2. గౌ|| శ్రీ రఘువీరారెడ్డి
    3. గౌ|| శ్రీ వెవేకానంద రెడ్డి
    4. గౌ|| శ్రీ రాజశేఖర్ రెడ్డి     [1]

13. గ్రామ సభ విదులను నిర్దేశించేది ఏది?
    1. జిల్లా పరిషత్
    2. లోక్ సభ
    3. ప్రజలు
    4. రాష్ట్ర శాసన సభ     [4]

14. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో శ్రీకారం చుట్టిన పథకం?
    1. రాజీవ్ యువకిరణాలు
    2. రానీవ్ ఉద్యోగశ్రీ
    3. రాజీవ్ ఉద్యోగ కిరణాలు
    4. రాజీవ్ యువశక్తి    [1]

15. ఈ కింది నదులలో వరాహా పర్వతాలలో పుట్టినది ఏది?
    1. తుంగభద్ర
    2. గోదావరి
    3. కృష్ణ
    4. గంగా     [2]

16. ఈ క్రింది వాటిలో పొడవైన భ్యారేజీ ఏది?
    1. ప్రకాశం భ్యారేజీ
    2. సర్ అర్దర్ కాటన్ భ్యారేజీ
    3. గొట్ట భ్యారేజీ
    4. పోచంపాడు చ్యారేజీ     [2]

17. క్షీర విప్లవానికి శ్రీకారం చుడుతూ పశుక్రాంతి పధకాన్ని ప్రారంభించిన వారు ఎవరు?
    1. గౌ|| శ్రీ వైఎస్ రాజశేఖర్రెడ్డి
    2. గౌ|| శ్రీ నరా చంద్రబాబు నాయుడు
    3. గౌ|| శ్రీమతి సోనియాగంధీ
    4. గౌ|| శ్రీ రాజీవ్ గాంధీ     [1]

18. మన రాష్ట్రంలో ఏ జిల్లాలో అన్నమయ్య రిజర్వాయర్ ఉంది?
    1. చిత్తూరు
    2. కడప
    3. అనంతపురం
    4. కర్నూలు     [2]

19. పులికాట్ సరస్సు ఏ జిల్లాలో ఉంది?
    1. పశ్చిమగోదావరి
    2. కృష్ణా
    3. ప్రకాశం
    4. నెల్లూరు     [4]

20. వ్వవసాయ అవసరాల కోసం మొట్టమొదటి సారిగా నదులపై ఆనకట్టలు నిర్మించింది ఎవరు?
    1. ద్రావిడులు
    2. ఆర్యులు
    3. గ్రీకులు
    4. పైవేవీ కావు     [1]

21. ఏ రాష్ట్రంలో గ్రామ సభకు పంచాయతీ సభ్యుల్ని రీకల్ చేసే ఆధికారాన్ని ఇచ్చారు?
    1. మధ్యప్రదేశ్
    2. ఒరిస్సా
    3. ఆంధ్రప్రదేశ్
    4. కర్ణాటక     [1]

22. నైరుతి రుతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం ఏది?
    1. ఉత్తర ఆంధ్ర ప్రాంతం
    2. తెలంగాణ ప్రాంతం
    3. రాయలనీమ ప్రంతమ్
    4. దక్షిణ కోస్తా ప్రంతమ్     [2]

23. దిగుడు భావుల ద్వారా సాధారణంగా ఏ వ్యాధి వ్యాపిస్తుంది?
    1. నారికురుపు వ్యాధి
    2. మలేరియా
    3. టైఫాయిడ్
    4. కలరా     [1]

24. పశువులలో వచ్చే "పుట్ మరియు మౌట్" వ్యాధి దేనివల్ల వస్తుంది?
    1. బ్యాక్టీరియా
    2. వైరస్
    3. శిలీంధ్రం
    4. దోమ     [3]

25. సెల్ప్ హెల్ప్ గ్రూపు మహిళలకు పెన్ష్న్ సౌకర్యం ఏ పధకం కింద కల్పించబడింది?
    1. ఇందిరమ్మ పథకం
    2. వై.ఎస్.ఆర్ అభయ హస్తం
    3. లోఅనియా అభయ హస్తం
    4. ఇందిర ప్రభ [2]

26. గోబర్ గ్యాసులో ముఖ్యంగా ఉండే వాయువు ఏది?
   1. కర్బన్-డయాక్సైడ్
   2. మీధేన్
   3. ఎసిటలీన్
   4. ఇథిలీన్    [2]

27. అడవులలో గిరిజనులు చేసే వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారు?
    1. డ్రిప్ ఇరిగేషన్
    2. పంట మార్పిడి వ్యవసాయం
    3. భీడు వ్యవసాయం
    4. పోడు వ్యవసాయం     [4]

28. పినాకిని నదికి మరోక పేరు?
    1. గోదావరి
    2. కావేరి
    3. కృష్ణా
    4. పెన్నా     [4]

29. గ్రామంలో రేషన్ కార్డు పొందుటకు ఈ కింది వానిలో ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి?
    1. మండలాధ్యక్షుడు
    2. మండల తహశీల్ధార్
    3. పంచాయతీ అధ్యక్షుడు
    4. వీరెవ్వరు కాదు     [2]

30. గ్రామీణ ఉపాధి హమీ చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంత జరిమానా విధించవచ్చు?
    1. రూ. 1000
    2. రూ. 100
    3. రూ. 500
    4. రూ. 300 [2]

31. ఈ కింది వానిలో కృత్రిమ ఎరువు ఏది?
    1. వేరుశనగ పిండి
    2. యూరియా
    3. వర్మికంపోస్ట్
    4. ఆముదం పిండి [2]

32. పావలా వడ్డీ అనగా ఎంత శాతం వడ్డీ?
    1. 3%
    2. 4%
    3. 6%
    4. 9%     [1]

33. ఆంధ్రప్రదేస్ రాష్ట్రంలో జలయజ్ఞం ఫలాలను పొలాల వరకు తీలుకువెళ్ళిన తొలి ప్రాజెక్టు ఏది?
    1. వెలిగొండ
    2. పులిచింతల
    3. సూరంపలెం
    4. ప్రాణహిత-చెవెళ్ల [3]

34.సంవత్సరంలో ఏ పంట సీజనను రభీ సీజను అంటారు?
    1. సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు
    2. డిసెంబర్ నుండి ఏప్రిల్ వరకు
    3. ఆగస్టు నుండి నవంబర్ వరకు
    4. జూన్ రెండి సెప్టెంబర్ వరకు     [2]

35. అగ్ని ప్రమాదాలు నివారించడానికి ఉపయోగించే వాయువు ఏది?
    1. ఆక్సిజన్
    2. కార్బన్-డయాక్సైడ్
    3. నైట్రిక్ ఆక్సైడ్
    4. కార్బన్ మోనాక్సైడ్ [2]

36. స్త్రీలకు పంచాయతీలలో ఎంత రిజ్ర్వేషన్ ఉంది?
    1. 1/2 వంతు
    2. 1/3 వంతు
    3. 2/3 వంతు
    4. 1/4 వంతు     [1]
       నోట్: జాతీయ స్థాయిలో 1/3 వంతుగా ఉంది?

37. ఆంధ్రప్రధేశ్ లో ఏ సంవత్సరంలో మండల పరిషత్తులు ఏర్పాటు చేశారు?
    1. 1984
    2. 1985
    3. 1986
    4. 1956     [3]

38. ఒక ఎకరానికి ఎన్ని చదరపు గజములు?
    1. 4800
    2. 4840
    3. 8440
    4. 4440     [2]

39. రాష్ట్రంలో పాడి పరిశ్రమలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏది?
    1. కృష్ణా
    2. చిత్తూరు
    3. కరీంనగర్
    4. అదిలాబాద్     [2]

40. ఏ పథకం ద్వారా ఎటువంటి ఆధారం లేని మహిళలకు, ఆనాథ మహిళలకు వితంతువులకు ఆధారం కల్పిస్తారు?
    1. అరోగ్యవరం
    2. ఆర్.సి.హెచ్.
    3. స్వావలంబన
    4. స్వధార     [4]

41. స్వాతంత్య్రానంతరం భారత దేశంలో మొతటి సాదారణ ఎన్నికలు జరిగిన సంవత్సరం ఏది?
    1. 1949
    2. 1947
    3. 1951
    4. 1952     [4]

42. స్టెయిన్-లెస్ స్టీల్ అనేది దేని యొక్క మిశ్రమ లోహం?
    1. ఇనుము, కార్భన్ మరియు నికెల్
    2. ఇనుము మరియు మాంగనీస్
    3. ఇనుము, క్రోమియమ్ మిరియు జింక్
    4. ఇనుము, క్రోమియమ్ మిరియు నికెల్     [4]

43. భారత-చైనా దేశాల మద్య యుద్దం జరిగిన సంవత్సరం ఏది?
    1. 1959
    2. 1965
    3. 1962
    4. 1956     [3]

44. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయాన్ని అంచనా వేయడానికి ప్రస్తుతం ఏ పద్ధతిని పాటిస్తున్నారు?
    1. ఉత్పత్తి పద్ధతి
    2. ఉత్పాదకాల పద్ధతి
    3. న్యాయ పద్ధతి
    4. ఆదాయ పద్ధతి     [1]

45. నాటికల్ మైల్ అనే ప్రమణాన్ని దేనికి ఉపయోగిస్తారు?
    1. ఆస్ట్రానమీ
    2. నావిగేషన్
    3. రోడ్-మైల్
    4. దేశం యొక్క సరిహద్దులు కొలవడానికి    [2]

46. రెండు కంపన జనకాల నుండి ఒకే పౌనఃపున్యం మరియు ఒకే కంపన పరిమితలతో వున్న తరంగాల ఆధ్యారోహణ జరగడం వలన ఏర్వడే భౌతిక ప్రభావాన్ని ఏమంటారు?
    1. వక్రీభవనం
    2. వ్యతికరణం
    3. వివర్తనం
    4. పరావర్తనం     [3]

47. కుండలను తయారు చేయడం ఏ యుగంలో ప్రారంభమైంది?
    1. ప్రాచీన శిలాయుగం
    2. మధ్య శిలాయుగం
    3. నవీన శిలాయుగం
    4. తామ్రశిలాయుగం     [3]

48. లక్షదీవుల రాజధాని ఏది?
    1. చండీఘర్
    2. కవరత్తి
    3. సిల్వస్యా
    4. దమన్     [2]

49. మహాభారతం యొక్క అసలు పేరు ఏమిటి?
    1. వ్యాసగీతం
    2. బ్రహ్మ సంహిత
    3. జయ సంహిత
    4. బృహత్కథ     [3]

50. భారత దేశపు భూ సరిహద్దు పొడవు ఎంత?
    1. 15150 కి.మీ.
    2. 15005 కి.మీ.
    3. 15200 కి.మీ.
    4. 14950 కి.మీ     [3]

51. ఈ కింది వాటిలో భారత-పాకిస్తాన్ దేశాలను వేరు చేస్తున్న రేఖ ఏది?
    1. మెక్-మోహన్ రేఖ
    2. డ్యురాండ్ రేఖ
    3. రాడ్-క్లిఫ్ రేఖ
    4. 34o ఉత్తర అక్షాంశ రేఖ     [3]

52. వార్షిక ఆదాయ ప్రాతిపదికన గ్రామ పంచాయతీలు ఎన్ని రకాలు?
    1. 3
    2. 2
    3. 4
    4. 5     [2]

53. ఈ కింది వాటిలో వేడిమికి అతి త్వరగా నశించిపోయే విటమిన్ ఏది?
    1. E
    2. B
    3. C
    4. D     [3]

54. మానవ శరీరంలో ఉష్ణోగ్రత క్రమతా కేంద్రం అని దేనిని అంటారు?
    1. పీనియల్
    2. హైపోథాలమస్
    3. థైరాయిడ్
    4. పిట్యూటరీ     [2]

55. గురుత్వత్వరణం (g) ధ్రువాల దగ్గర?
    1. అత్యధికం
    2. అత్యల్పం
    3. మార్పు ఉండదు
    4. సున్నా     [1]

56. సాధారణ పెరుగుదలకు, ప్రత్యుత్పత్తికి మరియు జీవన కాలం అధికం కావడానికి అవసరమైన మూలకం ఏది?
    1. మాంగనీస్
    2. అయోడిన్
    3. లైపెజ్
    4. ట్రిప్సన్     [2]

57. ఆరోగ్యంగా ఉన్న మానవునిలో ఎర్రరక్త కణాలు, తెల్లరక్త కణాల మధ్య ఉండాల్సిన నిష్పత్తి ఎంత?
    1. 1 : 1000
    2. 1 : 600
    3. 600 : 1
    4. 1 : 5000     [3]

58. మొక్కలపై దాడి చేసే వైరస్ లను ఏమంటారు?
    1. జూపేజ్
    2. రాపేజ్
    3. జథిపేజ్
    4. పైటోపేజ్     [4]

59. పిల్లి, ఆవు, గేదె వంటి జంతువుల కళ్ళు రాత్రిపూట మెరుస్తూ ఉండడానికి కారణం ఏమిటి?
    1. రెటీనా బాగా వృద్ధి చెంది ఉండుట వలన
    2. రెటీనాలో రాడ్ ల కంటే కోన్ లు బాగా వృద్ధి చెంది ఉండుట వలన
    3. రెటీనా కోన్ ల కంటే రాడ్ లు బాగా వృద్ధి చెంది ఉండుట వలన
    4. రెటీనా వెలుపల టపేటమ్ లుసిడమ్ ఉండుటవలన     [3]

60. మానవుని ప్రేగులో సహజీవిగా నివసించు బ్యాక్టీరియా పేరు ఏమిటి?
    1. ఎశ్చరిషియాకోలై
    2. ఎనిమల్-క్యూల్
    3. కోలైక్యూల్
    4. షియాక్యూల్     [1]

61. 3 : 4 నిష్పత్తిలో ఉన్న రెండు సంఖ్యల మొత్తం 70 అయితే వాటి వార్గాల మధ్య భేదం ఎంత?
    1. 2500
    2. 1800
    3. 1100
    4. 700     [4]

62.ఒక తండ్రీ కొడుకుల వయస్సుల నిష్పత్తి 2:1, 15 సంవత్సరాల అనంతరం వారి వయస్సుల నిష్పత్తి 3:2 అయిన నేటి నుంచి 20 సంవత్సరాల తరువాత తండ్రి వయస్సు ఎంత?
    1. 55
    2. 60
    3. 50
    4. 45 [3]

63. ఒక తరగతిలో ప్రథమ స్థానం సంపాదించిన విఢ్యార్థి మార్కులు 67 మరియు చివరి స్థానం తెచ్చుకున్న విద్యార్థి మార్కులు 32. అయితే కొన్ని పొరపాట్ల వలన వీటిని 76 మిరియు 23 గా రాసిరి. అయినచో ఆ తరగతి సరాసరి మార్కులలో వచ్చే మార్పు ఎంత?
    1. 9 మార్కులు తగ్గును
    2. 9 మార్కులు పెరుగును
    3. ఎటువంటి మార్పూలేదు
    4. క్లాసులోని మొత్తం విద్యార్థుల సంఖ్య తెలియదు. కావున ప్రశ్నకు జవాబు కనుగొనడం సాధ్యపడుదు.     [3]

64. 3 సంవత్సరాల క్రితం A మరియు B ల సరాసరి వయస్సు 18 సంవత్సరాలు అయి, వారితో C కలిసిన ఇప్పుడు వారి సరాసరి వయస్సు 22 సంవత్సరాలు అయినచో C ప్రస్తుత వయస్సెంత?
    1. 24 సం||లు
    2. 27 సం||లు
    3. 28 సం||లు
    4. 30 సం||లు     [1]

65. ఒక బ్యాట్స్-మెన్ 16 ఇన్నింగుల వరకు కొన్ని సగటు పరుగులు కలిగి ఉన్నాడు. ఇతను 17వ ఇన్నింగ్-లో 87 పరుగులు చేసిను. దీన్ని ద్వారా అతని సరాసరి 3 పరుగులు పెరిగెను. అయితే 17వ ఇన్నింగ్స్ తర్వాత అతని సరాసరి ఎంత?
    1. 39
    2. 36
    3. 40
    4. 37     [1]

66. A, B, C లు వరుసగా 28,000, 22,000 మరియు 18,000 రూపాయలను పెట్టుబడి పెట్టి ఒక వ్యాపారన్ని ప్రారంభించారు. వారిలో A వ్యాపార లావాదేవీలను పర్యవేక్షించడం వలన, మొత్తం లాభంలో 15 శాతాన్ని అతనికి జీతంగా ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. వ్యాపారంలో వచ్చిన వార్షిక లాభం 40,000 రూపాయలు అయిన B కి వచ్చే వాటా ఎంతో కనుగొనండీ?
    1. రూ. 14,000
    2. రూ. 11,000
    3. రూ. 16000
    4. రూ. 15000     [2]

67. X, Y, Z లు 2:3:5 నిష్షత్తిలో పెట్టుబడులు పెట్టారు. వారి పెట్టుబడుల కాలపరిమితుల నిష్షత్తి 4:5:6 అయినచో, వారి లాభాలు నిష్షత్తిని కనుగొనండి?
    1. 8:10:20
    2. 8:15:30
    3. 3:5:15
    4. 9:20:40 [2]

68. ఒక చతురస్రం చుట్టు కొలత 280 మీటర్లు. దాన్ని వైశాల్యాన్ని కనుగొనుము?
    1. 140 చ.మీ
    2. 1400 చ.మీ
    3. 4900 చ.మీ
    4. 70 చ.మీ     [3]

69. 8,000 రూపాయలను 10 శాతం రేటుతో బారువడ్డీకి ఇవ్వగా, 3 సంవత్సరాల తరువాత ఎంత మొత్తం అవుతుంది?
    1. రూ. 10,200
    2. రూ. 8,240
    3. రూ. 10,040
    4. రూ. 10,400     [4]

70. అర్థ సంవత్సరానికి ఒకసారి లెక్కగట్టే పద్ధతిలో సంవత్సరానికి 10% వడ్డీ రేటుతో రూ. 6,000 మీద ఒక సంవత్సరానికి అంతమయ్యే చక్రవడ్డీకి, అదే మొత్తానికి అదే రేటుతో ఒక సంవత్సరానికి అయ్యే సరళ వడ్డీకి మధ్య ఉన్న వ్యత్యాసమొంత?
    1. రూ. 44
    2. రూ. 66
    3. రూ. 15
    4. రూ. 25     [3]

71. 75 రూపాయలకు ఎంత శాతం కలిపితే 90 రూపాయలు అవుతుంది?
    1. 10
    2. 15
    3. 20
    4. 30     [3]

72. ఒక మనిషి ఒక నిర్దిష్ట దూరాన్ని గంటకు 20 కి.మీ. వేగంతో ప్రయాణించెను. తిరుగు ప్రయాణంలో గంటకు 30 కి.మీ వేగంతో ప్రయాణించి అదే స్థానానికి చేరుకొనెను. అయితే మొత్తం ప్రయాణంలో అతని యొక్క సరాసరి వేగమంత?
    1. 25 కి.మీ/గం
    2. 22 కి.మీ/గం
    3. 24 కి.మీ/గం
    4. 26 కి.మీ/గం     [3]

73. ఒక రైలు హైదరాబాద్ లో ఉదయం 6 గంటలకు బయలుదేరి, విజయవాడకు ఉదయం 10 గంటలకు చేరును. ఇంకొక రైలు విజయవాడలో ఉదయం 8 గంటలకు బయలు దేరి హైదరాబాద్ కు ఉదయం 11.30 గంటలకు చేరును. అయితే అ రెండు రైళ్ళు ఏ టైమ్ వద్ద ఒకదానికి ఒకటి కలుస్తాయి?
    1. ఉదయం 9.26
    2. ఉదయం 9
    3. ఉదయం 8.30
    4. ఉదయం 8.56     [4]

74. B తో పోలిస్తే A రెండు రెట్లు వేగంగా నడువగలడు. C తో పోలిస్తే B మూడు రెట్లు వేగంగా నడువగలడు. ఒక ప్రయాణానికి C కి పట్టిన సమయం 42 నిమిషాలు అయితే A కి ఎంత సమయం పట్టును?
    1. 14 నిమిషాలు
    2. 32 నిమిషాలు
    3. 63 నిమిషాలు
    4. 7 నిమిషాలు     [4]

75. నలుగురు పురుషులు మరియు ఆరుగురు స్త్రీలు ఒక పనిని 8 రోజులలో చేయగలరు. అధే పనిని ముగ్గురు పురుషులు మరియు ఏడుగురు స్త్రీలు కలిని 10 రోజులలో చేయగలరు. అయితే 10 మంది స్త్రీలు ఎన్ని రోఅజులలో పూర్తి చేయగలరు?
    1. 40 రోజులు
    2. 44 రోజులు
    3. 36 రోజులు
    4. 42 రోజులు     [1]

76. ఒక పనిలో 3/4 వ భాగాన్ని A అనే వ్యక్తి 12 రోజులలో చేయగలడు. 1/8 వ భాగాన్ని ఆ వ్యక్తి ఎన్ని రోజులలో చేయగలడు?
    1. 3 రోజులు
    2. 2 రోజులు
    3. 4 రోజులు
    4. 5 రోజులు     [2]

77. ఒక పట్టణ ప్రస్తుత జవాభా 35,000. పురుషుల జనాభా 6 శాతం. స్త్రీల జనాభా 4 శాతం పెరిగితే, ఆ పట్టణ జనాభా 36,760 అవుతుంది. ప్రస్తుతం ఆ పట్ట్ణ స్త్రీల జనాభా ఎంత?
    1. 20,000
    2. 18,000
    3. 17,000
    4. 19,000     [3]

78. P ఒక ఇంటిని రూ.10,000కు కొని Q కి 10 శాతం లాభానికి అమ్మెను. తరువాత Q అదే ఇంటిని Pకి 10 శాతం నష్టానికి అమ్మెను. అయినచో మొత్తం మీద P యొక్క లాభం ఎంత?
    1. రూ. 1,000
    2. రూ. 1,100
    3. రూ. 2,000
    4. లాభనష్టాలు లేవు     [2]

79. ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవును 50 శాతం పెంచి, వెడల్పును 30 శాతం తగ్గించిన, ఆ దీర్ఘ వైశాల్యంలో వచ్చు మార్పు ఎంత శాతం?
    1. 10 శాతం తగ్గుదల
    2. 5 శాటం తగ్గుదల
    3. 3.5 శాటం తగ్గుదల
    4. 2 శాటం తగ్గుదల     [?]
        నోట్: సరియైన సమాధానం 5 శాతం పెరుగుదల

80. ఒక కళాళాల ఎన్నికల్లో మొత్తం ఓట్లలో 40 శాతం పొందిన అభ్యర్థి 160 ఓట్ల తేడాతో అతని ప్రత్యర్థి చేతిలో ఓడి పోయాడు. కాలేజీలో వేయబడిన మొత్తం ఓట్లు ఎన్ని?
    1. 800
    2. 900
    3. 1000
    4. 1200     [1]
81. ఒక లంబకోణ త్రిభుజం యొక్క కర్ణం 5 మీ. దాని భూమి 4 మీ. అయినా ఆ త్రిభుజం ఎత్తు మరియు వైశాల్యం వరుసగా?
    1. 3మీ. 6. చ.మీ
    2. 6మీ. 12 చ.మీ
    3. 7మీ. 14 చ.మీ
    4. 6.2మీ. 12.4 చ.మీ.     [1]

82. ఏ కనిష్ట సంఖ్యను తీసివేసిన 3030 ఖచ్చిత వర్గమగును?
    1. 5
    2. 6
    3. 8
    4. 15     [1]

83. దశాంశ భిన్నముగా 3.5 శాతాన్ని రాయుము?
    1. 3.50
    2. 0.0035
    3. 0.35
    4. 0.035     [4]

84. ఈ కిందివానిలో 3,29,720 అనే సంఖ్య దేనిచే శేషం లేకుండా భాగించపడుతుంది?
    1. 6
    2. 3
    3. 4
    4. 7    [3]

85. 525 రూపాయలను 5:2 నిష్పత్తిలో విభజించండి?
    1. 375:150
    2. 150:375
    3. 275:250
    4. 250:275     [1]

86. పై భుజం, కింది భుజం సమాంతరంగా ఉండి పక్క భుజాలు అసమాంతరంగా ఉంటే ఆ ఆకారాన్ని ఏమంటారు?
    1. త్రిభుజం
    2. చతురస్రం
    3. ట్రెపీజియం
    4. దీర్ఘచతురస్రం     [3]

87. రెండు సంఖ్యల మద్య నిష్పతి 9:5 మరియు ఆ సంఖ్యల మొత్తం 224. ఆ సంఖ్యలేవి?
    1. 100 మరియు 124
    2. 144 మరియు 80
    3. 150 మరియు 74
    4. 20 మరియు 24     [2]

88. నాలుగు గడియారాలు 18, 24, 40, 60 నిమిషాల వ్యవధిలో వరుసగా మ్రోగుతాయి. ఆ నాలుగు గడియారాలు ఉదయం 5 గంటలకు ఒకేసారిగామ్రోగితే, తిరిగి అన్నీ ఒకేసారి ఎన్ని గంటలకు మ్రోగుతయి?
    1. ఉదయం 11 గంటలకు
    2. మధ్యాహ్నం గం||
    3. మధ్యాహ్నం 2 గం||
    4. సాయంత్రం 5 గం||     [1]

89. ఏ గరిష్ట సంఖ్యచే 1356, 1868, 2764 లను భాగించిన ప్రతిసారీ శేషం 12 వస్తుంది?
    1. 64
    2. 124
    3. 156
    4. 260     [1]

90. ఒక పట్టకం 28 సెం.మీ., 96 సెం.మీ కర్ణాలు గల రాంబస్ ఆకారంలో ఉన్నది. దాని ఎత్తు 32 సెం.మీ. అయితే దాని ఘనపరిమాణం ఎంత?
    1. 21504 ఘ.సెం.మీ
    2. 43008 ఘ.సెం.మీ
    3. 34008 ఘ.సెం.మీ
    4. 12504 ఘ.సెం.మీ     [2]

91. ఆంగ్ల అక్షరాల శ్రేణిలో R విలువ 4.5 గాను N విలువ 3.5 గాను విర్దేశించపడితే Z విలువ ఎంత?
    1. 6.75
    2. 6.5
    3. 6
    4. 15     [2]

92. ఒక పరిభాషలో P / Q అనగా Pకి భార్య Q అని అర్థం. P-Q అనగా P యొక్క సోదరి Q అని అర్థం. P=Q అనగా P యొక్క కొడుకు Q అని అర్థం అయిన L/M=N లో L కి N ఏమవుతాడు?
    1. భర్త
    2. కొడుకు
    3. సోదరుడు
    4. తండ్రి     [2]

93. Y అను అతను ఉత్త్ర దిక్కునకు 30 మీటర్ల దూరం వెళ్ళి ఎడవ వైపునకు 50 మీటర్లు వెళ్ళెను. మరలా అక్కడి నుండి ఎడమ వైపునకు తిరిగి 30 మీటర్లు వెళ్ళెను. Y తన యథాస్థానానికి వెళ్ళాల్సియున్న అతను ఏ దిశ నుండి ఏ దిశకు ఎన్ని మీటర్ల దూరం వెళ్ళాలో కనుగొనండి?
    1. ఉత్తర దిశ నుండి దక్షిణ దిశకు 30 మీటర్లు
    2. పశ్చిమ దిశ నుండి తూర్పు దిశకు 50 మీటర్లు
    3. దక్షిణ దిశ నుండి ఉత్తర దిశకు 30 మీటర్లు
    4. తూర్పు దిశ నుండి పశ్చిమ దిశకు 50 మీటర్లు.     [2]

94. భారత స్వాతంత్య్ర దినోత్సవం 1996లో శుక్రవారం అయితే 2000 సంవత్సరంలో ఏ వారం అవుతుంది?
    1. బుధవారం
    2. గురువారం
    3. శుక్రవరం
    4. ఆదివారం     [1]

95. B=2, D=4, F=6, J=10, అయినచో ఈ కింది వానిలో సరియైనది ఏది?
    1. K=12, L=14
    2. L=12, N=14
    3. M=12, N=14
    4. L=12 K=14     [2]

96. ఏకత్వానికి భిన్నత్వంలాంటిదే, స్వార్థానికి..........
    1. కలహం
    2. పరోపకారం
    3. అహంకారం
    4. తెలివి     [2]

97. ఓ ముసలి వ్యక్తిని చూపిస్తూ అనిల్ "అతని కుమారుడు నా కుమారునికి బాబాయి" అని చెప్పినాడు. అయినచో ఆ ముసలి వ్వక్తి అనిల్ కు ఏమవును?
    1. తాత
    2. సోదరుడు
    3. బాబాయి
    4. తండ్రి     [4]

98. ఒక కోడ్ లో HYDERABAD ని LCHIVEFEH గా రాస్తే ఆ కోడ్ లో VIJAYAWADA ని ఏ విధంగా రాస్తారు?
    1. ZMNCECAEHA
    2. ZMNCCECAEAH
    3. ZMNECEAEHE
    4. ZNMECEAEHA     [3]

99. ఈ క్రింది ఇవ్వబడిన వాటిలో భిన్నంగా ఉన్న దానిని గుర్తింపుము?
    1. విద్యార్థి - చదువు
    2. కార్మికుడు - శ్రమ
    3. గడ్డపార - వ్యవసాయము
    4. వైద్యుడు - చికిత్స     [3]

100. ఈ క్రింద ఇవ్వబడిన శ్రేణిలో తదుపరి సంఖ్యను కనుగొనుము 6, 64, 8, 60, 10, 56, 12, ?
    1. 62
    2. 52
    3. 56
    4. 42     [2]

No comments:

Post a Comment